నిమ్మగడ్డ పాచిక పారలేదు… కుట్రలన్నీ పటాపంచలు – విజయసాయి రెడ్డి

Friday, February 12th, 2021, 05:04:40 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నిమ్మగడ్డ పాచిక పారలేదు, కుట్రలు అన్నీ పటాపంచలు అయ్యాయి అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలోనే చంద్రబాబు ను అద్దంలో చూపించేశారు ప్రజలు అంటూ విమర్శించారు. అంతేకాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి అధికారాలు ఉపయోగించలేదు అంటూ లేఖలు రాస్తున్నాడు నాయుడు బాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓట్లు వేయకపోయినా టీడీపీ వారిని సర్పంచులు గా ప్రకటించాలా బాబు అంటూ సెటైర్స్ వేశారు విజయసాయి రెడ్డి.

అయితే మరొక ట్వీట్ లో చంద్రబాబు నాయుడు వైఖరి ను తప్పుబడుతూ విమర్శలు చేశారు. కోటియా గ్రామాలు అంటే ఒడిషా సరిహద్దు గ్రామాలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వీటి పై జ్యోతి మరియు ఈనాడు లు తప్పుడు కథనాలు రాశాయి అని, ఓట్ల కోసం పచ్చ కుల నేతలు రెచ్చగొట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తీరా చూస్తే ఆ గ్రామాలను ఆంధ్రా తీసుకుంది అంటూ ఒడిషా ఇవ్వాళ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది అని, ఇప్పుడు ఏమంటారు బాబు అంటూ సూటిగా ప్రశ్నించారు.