40 వేల కోట్ల బకాయిలు వదిలి వెళ్ళాడు – వైసీపీ ఎంపీ

Thursday, November 19th, 2020, 02:05:41 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ వైసిపి కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. దేశంలో బోగ్గే లేనట్లు కమిషన్ల కోసం బినామీల తో దిగుమతి చేయించాడు బాబు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కరెంట్ కంపనీ లకు యూనిట్ కి నాలుగు రూపాయలు ఎక్కువ చెల్లించి వాటాలు తీసుకున్నాడు అని సంచలన ఆరోపణలు చేశారు. 40 వేల కోట్ల రూపాయల బకాయిలు వదిలి వెళ్ళాడు అని విమర్శించారు. అయితే ఏడాది లో విద్యుత్ రంగాన్ని దేశంలోనే మూడవ స్థానంలో నిలపడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనా దక్షతకి నిదర్శనం అని అన్నారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ నలభై కోట్ల బకాయిలు మీరు కట్టారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు కూడా చౌకగా బోగ్గను దిగుమతి చేసుకున్న విషయం ను వివరించారు. ఏడాది లో ఏమి చేశారని మూడవ ర్యాంక్, ఆయన చేసిన దానికేగా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక విండ్ పవర్ అగ్రిమెంట్ ఎవరికోసం అంటూ సూటిగా ప్రశ్నించారు. కొందరు మాత్రం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకి గట్టి కౌంటర్ ఇస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు.