ట్రయాంగిల్ లవ్ స్టోరీలా లేదూ.. బీజేపీ, జనసేన, టీడీపీపై విజయసాయి సెటైర్లు..!

Tuesday, March 30th, 2021, 10:16:01 PM IST

Ycp-mp-Vijayasai-reddy
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ, జనసేన, టీడీపీలపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన రెండు పార్టీలు, మద్ధతు ఇచ్చేందుకే పుట్టిన ‘సపోర్టు సేన’ల డ్రామా అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని, బీజేపీ చంకలో దూరాలని పచ్చ పార్టీ ఆరాటం. వీర్రాజు గారేమో పవనే సీఎం అని తేల్చారని, తనకేమో బాబును ఇంకోసారి సిఎంగా చూడాలని కోరిక. ట్రయాంగిల్ లవ్ స్టోరీలా లేదూ అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే తిరుపతి పేరు వింటేనే చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని మొన్నటి పంచాయతీ, మున్సిపల్ తీర్పుతో వచ్చిన జ్వరం ఇంకా తగ్గక ముందే బై ఎలక్షన్ వచ్చిపడిందని 2లక్షల జనాభా, 50 వార్డులున్న కార్పోరేషన్లో ఒక్కటే దక్కిందని, మిగిలిన 6 సెగ్మంట్లలో ఇదే దుస్థితి అని, ఓటమి పగపట్టినట్టు తరుముతోందని అన్నారు. టీడీపీ గెలుస్తోందని ఊదరగొడుతూ ఎన్నికలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ బయలుదేరాడని, ఆక్టోపస్ ఫ్లాప్ షోతో దిగ్గజ విశ్లేషకుణ్ణి పచ్చ మీడియా రంగంలోకి దించిందని అన్నారు. ఇప్పుడు విశాఖ నుంచే మరో జోస్యుడు తయారయ్యాడని, అతను తిరుపతి ఉప ఎన్నికల్లో ‘గంట’ల పంచాంగం చెబుతున్నాడని అన్నారు.