ఆ ఇద్దరితో మీకున్న సంబంధం ఏమిటి.. చంద్రబాబుకు విజయసాయి సూటి ప్రశ్న..!

Monday, August 24th, 2020, 12:30:05 PM IST

Chandrababu_Vijayasai

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సూటి ప్రశ్న వేశారు. ఇటీవల విజవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించి రమేశ్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కూడా దోషులుగా భావించి కేసులు నమోదు చేశారు.

అయితే ప్రస్తుతం రమేశ్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేశ్ అజ్ఞాతంలో ఉన్నాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబూ మిమంల్ని నేరుగా ఒకటి అడుగుతున్నా ఇంతకీ డాక్టర్ రమేష్ ను మీ ఇంట్లో దాచారా? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా అని ప్రశ్నించారు. ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్ ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి అని నిలదీస్తూ ట్వీట్ చేశారు.