ప్లేస్ మారితే లెక్కమారుతుందా.. చంద్రబాబుకి విజయసాయి సూటి ప్రశ్న..!

Tuesday, February 16th, 2021, 02:23:32 AM IST

Ycp-mp-Vijayasai-reddy
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సూటి ప్రశ్న వేశారు. టీడీపీ గెలిచింది 39.52 శాతం పంచాయతీలా లేక 39 చోట్లా? అని మీ ఎమ్మెల్యేలున్న ఎక్కడైనా 10 శాతం పంచాయతీలు గెలిచారా బాబూ అంటూ ఎన్నికల తర్వాత వైసీపీ కండువాతో అభిమానుల జాబితాను మేం విడుదల చేస్తున్నాం. కాకిలెక్కలు మాని గెలిచిన మీ మద్దతుదారుల పేర్లైనా ప్రకటించగలరా అని ప్రశ్నించారు.

అంతేకాదు చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయి చిత్ర విచిత్ర డిమాండ్లు చేస్తున్నాడని, ఎన్నికల కౌంటింగ్ మండల కేంద్రాల్లో జరపకపోతే కోర్టుకెక్కుతాడట అంటూ టీడీపీ ఆఫీసుల్లోనో, కరకట్ట మీదున్న నీ అక్రమ కట్టడంలోనో కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేయకపోయావా? ప్లేస్ మారితే లెక్క ఏమైనా మారుతుందా అని ప్రశ్నించారు. అనంతరం రేషన్ పంపిణీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని కూడా ప్రస్తావిస్తూ కుట్రలతో నిమ్మగడ్డ, చంద్రబాబు రేషన్ పంపిణీకి మోకాలడ్డాలనుకున్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్వాతంత్రం వచ్చాక ఎన్నో ఎన్నికలు జరిగినా రేషన్‌ను ఎవరూ అడ్డుకోలేదని, పేదల తిండి గింజల్ని సైతం అడ్డుకున్నారంటే వారికి జనం అంటే ఎంత కడుపుమంటో అర్థం చేసుకోవచ్చని విజయసాయి అన్నారు.