ప్రతి దానికి కులం కార్డు వేస్తున్న చంద్రబాబు..!

Saturday, July 4th, 2020, 04:56:34 PM IST

గత కొన్ని రోజుల నుంచి ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీల నడుమ తారా స్థాయి విమర్శలు నడుస్తున్నాయి. అలాగే టీడీపీ కు చెందిన కీలక నేత అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చెయ్యడం తో టీడీపీ లో మరింత కలకలం జరిగింది. అయితే ఆ అరెస్టును కాస్తా టీడీపీ నేతలు మరియు అధిష్టానం కులం పేరు చూపి జగన్ ప్రభుత్వం బీసీ నేతలను కావాలనే అరెస్ట్ చేస్తుంది అని జగన్ బీసీ ద్రోహి అంటూ ఇప్పటికీ అదే ప్రచారం చేస్తున్నారు.

అసలు అనవసరమైన విషయాల్లో కూడా కులాన్ని లాగడం అంత సమంజసం కాదని చెప్పాలి. ఇదిలా ఉండగా ఇపుడు టీడీపీకు చెందిన మరో నేత మర్డర్ కేసులో అరెస్ట్ అయితే బాబు మళ్లీ గగ్గోలు పెడుతున్నాడాని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్ పెట్టారు. “మర్డర్ కేసులో ఒక టీడీపీ నాయకుడు అరెస్టైతే బీసీలపై దాడంటూ అర్థ రాత్రి ఫోన్లు చేసి రచ్చ చేస్తున్నాడు నాయుడు బాబు. హత్యకు గురైన భాస్కర రావు బీసీ కాదా? బాధితునికి న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీ మహిళల ధర్నాలు కనిపించడం లేదా?
ప్రతిదానికి కులం కార్డు ఏంటి బాబు.” అని బాబుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దీనితో పాటుగా “ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ హాస్పిటళ్లను ఎలుకలకు వదిలేసి కార్పోరేట్ ఆసుపత్రులను ప్రమోట్ చేశాడు బాబు. పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తించదని జిఓలిచ్చింది అందుకే. 1800 అంబులెన్సులు కొన్నానని నిర్లజ్జగా బుకాయిస్తున్నాడు. గుట్టలుగా మూలకు పడిన 108 వాహనాల ఫోటోలను ప్రజలంతా చూసారు.” అంటూ బాబుపై సంచలన ట్వీట్స్ వేశారు..