బిగ్ బ్రేకింగ్ : ఏబీఎన్ రాధాకృష్ణపై సంచలన రేపిన విజయసాయి రెడ్డి.!

Tuesday, June 2nd, 2020, 05:54:54 PM IST

ఏపీ రాజకీయాలు ఇతర రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే కాస్త విభిన్నంగానే ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా మీడియా సంస్థలకు మరియు రాజకీయ పార్టీల నడుమ పెద్ద యుద్ధమే నడుస్తుంది. అధికార పార్టీలు నేరుగానే ఆయా వార్తా ఛానెల్స్ ను మరియు వాటి యజమానులను పేర్లు పెట్టే టార్గెట్ చేసేస్తారు.

అందులో ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఒక మెట్టు పైనే ఉంటారు. ప్రముఖ వార్తా ఛానెల్ ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై ఇప్పటికే పలుమార్లు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అలా ఇప్పుడు మరోసారి సంచలన ట్వీట్ పెట్టారు.

“తమ సోషల్ మీడియా బృందాన్ని ఎవరూ ఓన్ చేసుకునేందుకు అంగీకరించడం లేదని ఏబీఎన్ రాధాకృష్ణ తలా గోక్కుంటున్నాడని, తమ జీవితంలో విధేయత అనే పదం లేని వారి నుంచి విఎస్ ఆర్ సెల్ఫ్ గోల్ లాంటి డిబేట్లు చూడడంలో పెద్ద ఆశ్చర్యం లేదని” ఆర్కే పై మరోసారి సంచలనం రేపారు.