ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజలు నిన్ను నమ్మరు బాబు – విజయసాయి రెడ్డి

Thursday, January 28th, 2021, 10:00:22 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయని, పార్టీ గుర్తులు, జెండాలు ఉండవని అన్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసని కానీ ఓటమి భయం తీవ్ర అలజడి రేపినట్లుందని అన్నారు. జనరల్‌ ఎలక్షన్స్‌ స్థాయిలో మేనిఫెస్టో అంటూ కామెడీ చేస్తున్నారని, ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజలు నిన్ను నమ్మరు బాబూ అంటూ ఎద్దేవా చేశారు.

ఇక అంతకు ముందు నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అని అధికారంలో ఉన్నప్పుడు ఓటమి భయంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా వాటిని అంధకారంలోకి నెట్టిన చంద్రబాబు, ఇప్పుడు పంచ సూత్రాలతో పల్లెల్లో వెలుగులు నింపుతానంటూ వస్తున్నారని, మాయావి వలలో పడితే మళ్ళీ చీకట్లోకే పయనమే అంటూ విజయసాయి ప్రజలకు సూచించారు.