ఆ పరిష్కారానికి ముందడుగు వేసింది సీఎం జగన్ ఒక్కడే – విజయసాయి రెడ్డి

Tuesday, August 25th, 2020, 11:45:49 AM IST

ఏపీ సీఎం జగన్‌పై విజయసాయి రెడ్డి పొగడ్తలు కురిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి సీఎంగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టాక ఉద్దానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారని, 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

అయితే గతంలో నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారని, చూసి హడావుడి చేసి వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం అలా ఆలోచించకుండా కిడ్నీ బాధితుల సమస్యలను తెలుసుకుని వారిని ఆదుకున్నారని, పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.