అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Friday, August 14th, 2020, 02:06:08 PM IST

Ycp-mp-vijayasai-reddy

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావించింది. ఈ నేపధ్యంలో అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాజధాని మార్పుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని ఓ పక్క రైతులు ఆందోళనలను మరింత ఉదృతం చేశారు. ఈ తరుణంలో దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదని, మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి గారి AMRDA సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుందని, రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరని అన్నారు.