టీజర్ తోనే రికార్డులను షేక్ చేస్తున్న “మాస్టర్”

Friday, November 27th, 2020, 06:25:39 PM IST

దళపతి విజయ్ అంటేనే తమిళనాట సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అయితే ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ టీజర్ యూట్యూబ్ లో విడుదల అయింది. అయితే ఈ చిత్ర టీజర్ కేవలం రెండు వారాల లోపే 4 కోట్లకి పైగా వ్యూస్ సాధించింది. ఈ వ్యూస్ తో మరొకసారి విజయ్ అంటే ఏంటో తెలుస్తోంది. ఈ టీజర్ పై ఇప్పటికే అభిమానులు నుండి మాత్రమే కాకుండా విమర్శకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. అయితే 16 గంటల్లోనే 1.6 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న టీజర్ గా రికార్డ్ కెక్కింది.

అయితే విజయ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా పడింది. అయితే ఈ సంక్రాంతి కి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అభిమానులు మాత్రం ఈ టీజర్ ను సోషల్ మీడియా లో సైతం తెగ షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.