సంక్రాంతి బరిలో విజయ్ “మాస్టర్”

Tuesday, December 29th, 2020, 03:09:40 PM IST

తమిళ క్రేజీ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ హీరోగా, మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న మాస్టర్ చిత్రం విడుదల కి సిద్దం అయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో ఉంచేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని జనవరి 13, 2021 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర విడుదల తేదీ కి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో ఆండ్రియా, అర్జన్ దాస్ మరియు శాంతను సైతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆగిపోయిన సినిమాలు అన్ని కూడా ఇక వరుసగా విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యాయి. విజయ్ మాస్టర్ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ మేరకు హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పలనిస్వామ ను కలిసి దియేటర్ సామర్ధ్యాల విషయంలో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. వంద శాతం సిట్టింగ్ తో థియేటర్లు కి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ మాస్టర్ చిత్రం లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విద్యార్థి గా మరియు ఆచార్యుడు గా నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.