ఇప్పట్లో ఇండియా రానంటున్న ‘లిక్కర్ కింగ్’

Sunday, March 13th, 2016, 06:50:40 PM IST


లిక్కర్ కింగ్ విజయ్ మాల్య 9,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్ వెల్లిపోయిఅ తరువాత ఆయనపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. 20 జాతీయ స్థాయి బ్యాంకులు ఆయనపై కేసులు కూడా పెట్టాయి. ఇక మీడియా అయితే ఏకంగా లండన్ లో ఉన్న విజయ్ మాల్యాను క్యాచ్ చెయ్యడానికి శత విధాలా ప్రయత్నించాయి. దీంతో మాల్యా ట్విట్టర్ ద్వారా తన మనసులో ఉన్న మాటలను తెలిపారు. బ్యాంకులన్నీ తన ఆస్తుల వివరాలను పరిశీలించిన తరువాతే తనకు అప్పులిచ్చాయని తెలిపారు.

రాజ్య సభ సభ్యుడినైన తనపై మోసగాడన్నా ముద్ర పడిందని.. అది పోయాకే ఇండియాకు తిరిగొస్తానని అన్నారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న తనను మీడియా తెగ ఇబ్బంది పెడుతోందని ఎంత ప్రయత్నించినా మీడియాకు తానూ దొరకనని.. వృధా ప్రయత్నం మానుకోమని తెలిపారు. అలాగే పరిస్థితులన్నీ చక్కబడ్డాకే ఇన్దియ్ తిరిగోస్తాన్ని అన్నారు. ఇకపోతే మాల్యా పై పలు రాష్ట్రస్థాయి కోర్టుల్లో నాన్ బైలబుల్ వారెంట్లు సైతం జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసులు, అప్పు ఎగవేత, మోసపూరితమైన ఆస్తులను చూపడం వంటి అభియోగాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి.