బిగ్ బాస్: హౌజ్ లో ఆ కంటిస్టెంట్ కి మద్దతు తెలిపిన విజయ్ దేవరకొండ

Monday, December 14th, 2020, 02:37:04 PM IST

Vijay-Devarakonda

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్, తుది దశకు చేరుకోవడంతో అభిమానులు తమకు నచ్చిన వ్యక్తిను గెలిపించుకోవడానికి సిద్దం అవుతున్నారు. అయితే అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక, అరియానా ఫైనల్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ ఐదుగురు కూడా టైటిల్ పై గురి పెట్టారు. తమకి నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాలని అభిమానులు కూడా ఫుల్ గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక వ్యక్తికి మాత్రం ప్రముఖుల నుండి మద్దతు భారీగా లభిస్తోంది.

హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా అభిజిత్ ఉన్నారు. టైటిల్ రేస్ కి అర్హత ఉన్న వ్యక్తి గా అభిమానులు కొనియాడుతున్నారు. అయితే ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు అభిజిత్ కి మద్దతు తెలుపగా, తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవర కొండ అభిజిత్ కి మద్దతు తెలిపారు. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు. మై బాయ్స్, ఎల్లప్పుడూ మీకు శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నా,దేనికైనా అంటూ చేశారు. అయితే అభిజిత్ కి ఇప్పుడు విజయ్ సపోర్ట్ లభించడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం తో అభిమానులను సంపాదించుకున్న అభిజిత్ చివరి వరకు ఉండి టైటిల్ గెలుస్తారో లేదో చూడాలి.