టాలీవుడ్ రౌడీబాయ్‌గా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా తొమ్మిది మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ కావడం విశేషం. అయితే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను కూడా విజయ్ వెనక్కి నెట్టేశాడంటేనే ఈ రౌడీ బాయ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందనేది ఈజీగా అర్ధమవుతుంది.
అయితే 2018 మార్చి 7 న విజయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఆయన ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది.