ఉప్పెన కి సరికొత్త జోష్ ఇచ్చిన విజయ్

Sunday, January 31st, 2021, 05:48:58 PM IST

వైష్ణవ తేజ్, కృత శెట్టి కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అయితే నేడు అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఉప్పెన కి సరికొత్త జోష్ ఇచ్చాడు. జల జల జలపాతం నువ్వు అనే పాటను నేడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అయితే విజయ్ దేవరకొండ యూత్ కి విపరీతమైన క్రేజ్ ఉండటం తో ఈ రొమాంటిక్ సాంగ్ ను విజయ్ తో విడుదల చేయించడం జరిగింది. అయితే ఈ సాంగ్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కృతి శెట్టి కి, వైష్ణవ్ తేజ్ లకు తొలి చిత్రం కాగా, సుకుమార్ రైటింగ్స్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.