డాక్టరేట్ అందుకున్న ప్రముఖ నటి!

Tuesday, June 2nd, 2015, 06:36:49 PM IST

vidya-balan
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు రాయ్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. కాగా అహ్మదాబాద్ కు చెందిన రాయ్ యూనివర్సిటీ భారత చిత్రసీమలో విశేష సేవలు అందించిన నటీమణులకు డాక్టరేట్ ను అందిస్తోంది. ఈ క్రమంలో ఈసారి విద్యాబాలన్ కు ఆ అవకాశం దక్కింది. ఇక దీనిపై విద్యాబాలన్ మాట్లాడుతూ తాను సినీరంగంలో పదేళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. అలాగే తనకు రాయ్ యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని విద్యాబాలన్ హర్షం వ్యక్తం చేసింది.

కాగా ‘బాలో థేకో’ అనే బెంగాలీ చిత్రం ద్వారా సినీతెరకు పరిచయమైన విద్యాబాలన్ అనంతరం ‘పరిణీత’ చిత్రం ద్వారా పాపులారిటీ సంపాదించుకుని బాలీవుడ్ లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇక ఆనతి కాలంలోనే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ నటీమణిని 2014లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో సత్కరించింది.