మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన వీహెచ్..!

Wednesday, March 17th, 2021, 05:00:37 PM IST

ఏపీ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న సీఎల్పీకి వచ్చిన జేసీ తెలంగాణ కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ నేతలపైనే కామెంట్స్ చేయడాన్ని వీహెచ్ తప్పుపట్టారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని తెలంగాణాలో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవడని, జోతిష్యాలు చెప్పడం జేసీ మానుకోవాలని సూచించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోందని అన్నారు. జేసీ నిజంగా దమ్మున్న లీడర్ అయితే తన బలాన్ని అనంతపురంలోనో లేదా రాయలసీమలో చూపించుకోవాలని తమ కాంగ్రెస్ నేతలపై తప్పుగా మాట్లాడితే బాగుండని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు.