కాంగ్రెస్ నే బొంద పెడతావా?…బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ లపై నిప్పులు చెరిగిన విహెచ్

Thursday, February 11th, 2021, 07:30:03 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న తెరాస పాలనా విధానం పై, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హెచ్ హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క సచివాలయం ను తప్ప దేశంలో అన్ని ప్రభుత్వ ఆస్తులను బీజేపీ అమ్మేసే లా ఉంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే బొంద పెడతావా అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో తీవ్ర అసహనం తో మాట్లాడారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ ఏ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద పెడతా అని అనడం పట్ల మండిపడ్డారు. కాలికింద నలిపేస్తా అని అనడం పద్దతి కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీఎం పదవి శాశ్వతం కాదు అని హితవు పలికారు. ప్రజల నిర్ణయం మేరకు అధికారం ఉంటుంది అని గుర్తెరిగి ప్రవర్తించాలి అని సూచించారు. అయితే ఇక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ వరాలు ప్రకటిస్తున్నారు అని, మరి రాష్ట్రం లోని మిగతా ప్రాంతాల పరిస్తితి ఏమిటి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. అయితే మార్పు తెస్తారని బీజేపీ కి అధికారం కట్టబెడితే,ఉన్నవి అన్నీ కూడా అమ్మేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడ్డారు.