రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అనేది ఎస్ ఈ సి ఉద్దేశ్యం

Sunday, January 24th, 2021, 05:19:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో అటు అధికార పార్టీ ఒక నిర్ణయం తో ఉంటే, ఇటు ఎన్నికల కమిషనర్ మరొక నిర్ణయం తో ఉన్నారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వంకి మధ్య జరుగుతున్న పోరాటం లో ఉద్యోగులు బలి అవుతున్నారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కి చెడ్డ పేరు తీసుకురావాలి అనేది ఎస్ ఈ సి ఉద్దేశ్యం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే కరోనా లేని సమయం లో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే ఎన్నికల నిర్వహణ పై ఎస్ ఈ సి కూడా నమ్మకం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ఉద్యోగుల పై ఎదురుదాడి చేయడం మంచి పద్దతి కాదు అని అన్నారు. అయితే తన పై నిఘా పెట్టాలి అని డీజీపీ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం సరికాదు అని, అయితే తన ప్రాణాలకు రక్షణ కావాలని డీజీపీ ను కొరుతా అంటూ మీడియా సమావేశం లో వెల్లడించారు. అంతేకాక వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఎన్నికలు నిర్వహించాలి అంటూ డిమాండ్ చేశారు.