పాలనలో స్వచ్చతకోసమే నీతి అయోగ్

Sunday, January 4th, 2015, 12:45:39 PM IST


దేశంలో అవినీతి కుళ్ళును తరిమికొట్టి, నీతి వంతమైన పాలను అందించడం కోసమే ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని రాష్ట్రాలకు సమానమైన భాగస్వామ్యం కల్పించాలని ఉద్దేశ్యంతోనే నీతి అయోగ్ ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర పట్టాణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడ ఆకాశవాణి కార్యాలయం ఆవరణలో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలను అధ్యయనం చేసిన తరువాతే.. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతిపక్షం అంటే ప్రతి అంశాన్ని విమర్శించడం కాదని, పార్లమెంట్ ఉన్నది దేశం అభివృద్ధి కోసమే అని ఆయన గుర్తుచేశారు. ఇక నీటి అయోగ్ ను విమర్శిస్తే… రీతి లేకుండా పోతారని వెంకయ్య నాయుడు స్పష్టం తెలియజేశారు.