అందరినీ ఆకట్టుకుంటున్న నారప్ప టీజర్

Sunday, December 13th, 2020, 12:47:19 PM IST

డిసెంబర్ 13 న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కావడం తో నారప్ప చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ పేరిట ఒక వీడియో ను విడుదల చేసింది. చేతిలో కత్తి తో, పవర్ ఫుల్ గెటప్ తో వెంకటేష్ విశ్వరూపం చూపించేసాడు. గ్లింప్స్ ఆఫ్ నారప్ప పేరిట విడుదల అయిన ఈ టీజర్ అభిమానులను మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఆకట్టుకుంతుంది. ఈ టీజర్ తోనే వెంకీ మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనున్నారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.