బిగ్ న్యూస్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి సోకిన కరోనా

Tuesday, September 29th, 2020, 10:58:06 PM IST

భారతదేశం లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడ్డారు. అయితే తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఉప రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు అని, ఆరోగ్యంగానే ఉన్నట్లు కార్యాలయం వెల్లడించడం జరిగింది.

అయితే వైద్యులు హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలి అని సూచించారు అని పేర్కొన్నారు. అయితే వెంకయ్య నాయుడు గారి సతీమణి ఉషా నాయుడు కి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది అని తెలిపారు. అయినప్పటికీ ఆమె కూడా స్వీయ నిర్బంధం లోనే ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే పలువురు నేతలు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి భారిన పడి కోలుకున్నారు.