నా ఆరోగ్యం బాగానే ఉంది – వెంకయ్య నాయుడు

Wednesday, September 30th, 2020, 11:10:09 PM IST

తాజాగా భారత దేశం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్ భారిన పడ్డట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైద్యులు సైతం వెంకయ్య నాయుడు కి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ చేయడం జరిగింది. అయితే ఈ వార్తల పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా స్పందించారు.

తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే ఈ మహమ్మారి భారి నుండి బయట పడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నా అని తెలిపారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు శ్రేయోభిలాషులు ఆందోళన వ్యక్తం చేయగా, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.