40 ఆలయాలను చంద్రబాబు కూలిస్తే జగన్ పునః నిర్మాణం చేసేందుకు పూనుకున్నారు!

Wednesday, June 9th, 2021, 05:24:33 PM IST


దేవాలయాలను కాపాడుకొనేందుకు అన్ని చర్యలను చేపడుతున్నాం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయ శాఖ భూములను కాపాడుకునే దిశగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే దేవాలయాలకు సంబంధించిన కమర్షియల్ స్థలాలను అభివృద్ది చేసి, ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు అనేక భూములను దారాదత్తం చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆక్రమణలు జరగకుండా పరిరక్షణ కు చర్యలు చేపడుతున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే ఆలయాల వద్ద 40 వేల సీసీటీవీ కెమెరా లను అమర్చడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే విమర్శలకు తావు ఇవ్వకుండా ఆలయాల వద్ద భద్రత పెంచి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేకాక 40 ఆలయాలను చంద్రబాబు నాయుడు కూలిస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలయాల పునః నిర్మాణానికి పూనుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు.