బిగ్ న్యూస్: చంద్రబాబు పేదల ద్రోహి…టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Wednesday, September 23rd, 2020, 04:57:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సముద్రమంత మార్పు క్ జగన్ పాలన లో కనిపిస్తుంది అని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. డైనమిక్ సీఎం జగన్ ఏపీ లో పరిపాలన చేస్తున్నారు అని, టీడీపీ హయాంలో జరగలేని పనులు జగన్ పాలన లో జరుగుతున్నాయి అంటూ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 14 నెలలు మనసు చంపుకొని టీడీపీ లో పని చేశాను అని ఎమ్మెల్యే తెలిపారు. వైజాగ్ లో సౌత్ నియోజక వర్గం పనుల కోసం బంట్రోతు లో తిరిగినా పనులు జరగలేదు అని, సూటు బూటు వేసుకొన్న వారికే టీడీపీ హయం లో పనులు జరిగాయి అని ఆరోపణలు చేశారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలి అని టీడీపీ చెప్పినట్లు తెలిపారు. ప్రజల కోసం ఉద్యమాలు చేయమని టీడీపీ చెప్పలేదు అంటూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ కి మనుగడ లేదు అని తెలిపారు. ఇంకో 20 లేదా 30 ఏళ్లు జగన్ సీఎం గా కొనసాగుతారు అని, పార్టీ ఆదేశాల మేరకే సీఎం జగన్ పై మనస్సు చంపుకొని విమర్శలు చేసినట్లు వివరించారు. అయితే తను పార్టీ ద్రోహి అయితే, చంద్రబాబు నాయుడు పేదల ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.