వరుణ్ తేజ్ కి కరోనా నెగటివ్..!

Thursday, January 7th, 2021, 03:33:31 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా దీని ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. అయితే ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుణ్ తేజ్ ఒక పోస్ట్ చేశారు. తనకు కరోనా వైరస్ నెగటివ్ వచ్చింది అని తెలిపారు.

అయితే నెగటివ్ అనే విషయం ఇంత సంతోషాన్ని ఇస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు అని వరుణ్ తేజ్ అన్నారు. అయితే తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ వరుణ్ పేర్కొన్నారు. అయితే వరుణ్ తేజ్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నీహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. రామ్ చరణ్ సైతం కరోనా వైరస్ భారిన పడిన విషయాన్ని వెల్లడించారు. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన తాజా అప్డేట్ ఏమీ రాకపోవడం తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.