శిరోముండనంపై పార్లమెంట్‌లో ప్రస్తావించండి.. కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ..!

Tuesday, August 25th, 2020, 02:00:11 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా శిరోముండన కేసు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య భారత పార్లమెంటు దళిత ఎంపీల ఫోరం అధ్యక్షులు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాష్వన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం ఈ కెసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తుందని, బాధితుడు రాష్ట్రపతికి మొరపెట్టుకున్న న్యాయం జరగలేదని అన్నారు.

అంతేకాదు బాధితుడికి న్యాయం చేయాలని రాష్ట్రపతి కార్యాలయం కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఘటనపై పార్లమెంటులో ప్రశ్నించి దళిత యువకుడికి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. తనకు న్యాయం జరగక పోతే తాను నక్సలైట్‌లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని బాధితుడు రాష్ట్రపతిని కోరాడని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు.