అలా చేయట్లేదని చెప్పే ధైర్యముందా.. వైసీపీకి వర్ల రామయ్య క్వశన్..!

Tuesday, August 18th, 2020, 07:40:35 PM IST

Varla-Ramaiah

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ప్రధాని మోదీకి లేఖ రాశారు.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చంద్రబాబుకి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మీకు అనుమానాలు ఉంటే తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు సమర్పిస్తే దర్యాప్తు చేపట్టి నింధితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే డీజీపీ లేఖపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్ష్యం ఇస్తేనే దర్యాప్తు చేస్తామనడం సరికాదని అన్నారు. చంద్రబాబుగారి లేఖ, పత్రికలో వార్తలు ఎందుకు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయరు అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు.