క్షమాపణ చెబుతారా.. సీఎం జగన్‌కి వర్ల రామయ్య సూటి ప్రశ్న..!

Thursday, August 6th, 2020, 07:25:56 PM IST


ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న వేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌పై మండిపడ్డారు.

ముఖ్యమంత్రి గారూ! కొంత మంది మీ మంత్రుల భాష, నాయకుల వ్యాఖ్యలు, చివరకు నిన్న మీ పందుల రవీంద్ర మతి లేని మాటలు మీ నాయకత్వ లక్షణాన్ని వెక్కిరిస్తున్నాయని అన్నారు. మీ యంఎల్ సి పందుల వ్యాఖ్య “బురదలో పొర్లాడు వరహాన్ని” పోలి ఉన్నదని అన్నారు. వారి నాయకుడిగా సమాజానికి మీరు క్షమాపణ చెబుతారా లేక వారే చెపుతారా అని నిలదీశారు.