ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది.. వర్లరామయ్య లేఖ..!

Saturday, October 3rd, 2020, 03:49:23 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు రోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య లేఖ మండిపడ్డారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-19(1)(ఏ) ద్వారా సంక్రమించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏపీలో పూర్తిగా హరించబడిందని వ్యాఖ్యానించారు.

అయితే దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఒక దళిత కుటుంబాన్ని సజీవదహనం చేయడానికి ప్రయత్నించినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కలగడం లేదని అన్నారు. మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడిని పోలీస్ స్టేషన్‌లో కొట్టి చంపారు, ఇసుక అక్రమ రవాణాకి అడ్డొచ్చాడని వరప్రసాద్ అనే యువకుడికి పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం వేశారు. అయితే ఈ ఘటనలకు బాధ్యులు అయిన అసలు ముద్దాయిలి ఇంకా అరెస్ట్ కాలేదని అన్నారు.