ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ సిద్దమయ్యింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణలో ముందు నుంచి ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు బాహాబాహీ నడుస్తుంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పుడు ఎన్నికల కమీషన్ సిద్దంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం అందుకు సహకరించడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర ప్రభుత్వం తీరు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు మధ్య అగాధం నానాటికీ పెరుగుతోందని అన్నారు. అంతేకాదు ఈ వ్యవస్థల తీరు, గతంలో పాకిస్తాన్ ప్రధానిగా ముషారఫ్ ఉన్న సమయంలో రెండు వ్యవస్థల మధ్య వైరం పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయని తెగేంత వరకు లాగకండి అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి గారూ! రాష్ట్రంలో ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య అగాధం నానాటికీ పెరుగుతోంది. చూస్తుంటే, ఈ వ్యవస్థల తీరు, గతంలో, పాకిస్తాన్ లో ముషారఫ్ టైమ్ లో రెండు వ్యవస్థల మధ్య వైరం పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.తెగేoత వరకు లాగ కండీ.
— Varla Ramaiah (@VarlaRamaiah) October 26, 2020