రాజధాని కోసం పోరాడుతున్న వారు ఒంటరి వారు కాదు – వర్ల రామయ్య

Monday, August 24th, 2020, 12:00:22 AM IST

Varla-Ramaiah

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని అమరావతి రైతులు 250 రోజుల పాటు నిరంతరంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నేడు మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రాజధాని పోరాటం ధర్మబద్ధమైనదని, ప్రజాస్వామ్య యుతమైనదని అన్నారు.

అయితే అమరావతి కోసం ఆందోళన చేస్తున్న మహిళలపై ప్రభుత్వం ఎందుకింత కక్ష్యతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆడవారని కూడా చూడకుండా వారిని లాఠీలతో కొట్టించడం, బూటుకాళ్లతో తన్నించడం న్యాయమేనా అని నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసిన వారిపై ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. రాజధాని కోసం పోరాడుతున్న వారు ఒంటరి వారు కాదని వారికి 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తల మద్ధతు ఉంటుందని చెప్పుకొచ్చారు.