ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు.. వైసీపీ సర్కార్‌కు వర్ల రామయ్య సూటి ప్రశ్న..!

Thursday, October 29th, 2020, 06:01:30 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ అమరావతి రైతులపై యుద్ధం ప్రకటించిందని, రాష్ట్రంలో ఎవరూ అమరావతి పేరును పలకకూడదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. అమరావతి మాట వినడానికి కూడా సీఎం జగన్ ఇష్టపడడం లేదని, అమరావతి ఉద్యమకారులను శత్రువులుగా చూస్తున్నారని అన్నారు.

అయితే అమరావతి ఉద్యమానికి కౌంటర్ ఆజిటేషన్ కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం బాధాకరమని, దేశంలో ఏ రాష్ట్రం కూడా కౌంటర్ అజిటేషన్ నడపలేదని చెప్పుకొచ్చారు. బేడీలు వేసిన రాజధాని రైతులలో 9 మంది ఎస్సీలు ఉంటే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఫిర్యాదుదారుడి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీఎం పేషీ నుంచి కాల్ రాగానే ఎందుకు మార్చివేశారని, అసలు పోలీసులకు ఆ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరని అడిగారు.