రైతులంటే సీఎం జగన్‌కు ఎందుకంత కోపం.. వర్ల రామయ్య సూటి ప్రశ్న..!

Monday, December 14th, 2020, 04:24:36 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సీరియస్ అయ్యారు. నేడు మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య అమరావతే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకించాలని ఢిల్లీలో రైతులు నిరసనలు తెలుపుతుంటే కేంద్రమే దిగివచ్చి రైతులతో చర్చలు జరుపుతుందని అన్నారు.

అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా చర్చలు జరపలేదని రైతులంటే సీఎం జగన్‌కు ఎందుకంత కోపమని, రాజధానికి భూములివ్వడం రైతులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఇలా విర్రవీగిన నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని సూచించారు.