కక్ష సాధింపే మీ లక్ష్యమా.. జగన్‌కి వర్ల రామయ్య సూటి ప్రశ్న..!

Saturday, October 24th, 2020, 08:00:23 PM IST

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా సూటి ప్రశ్న వేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై స్పందించిన ఆయన ముఖ్యమంత్రి గారూ! భూఆక్రమణ చేశారని గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ ధ్వంసం చేయడం ప్రభుత్వానికి ఆనందమేమో గాని, ఆక్రమణ రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఎందుకు డబ్బు వసూలు చేసి రెగ్యులరైజ్ చేయలేదని, ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన విశ్వవిద్యాలయంపై కక్ష సాధింపే మీ లక్ష్యమా అని ప్రశ్నించారు.

ఇక అంతకు ముందు అమరావతి ఉద్యమకారులను పేయిడ్ ఆర్టిస్టులని ఊదరకొట్టారని, నిన్న నకిలీ ఉద్యమానికి వస్తున్న పెయిడ్ ఆర్టిస్టులను ఆ ప్రాంత రైతులు పట్టుకున్నారు. రచ్చరచ్చ చేశారు. ప్రభుత్వమే నకిలీ ఉద్యమాలు చేయించడం చాలా దుర్మార్గం అని రాజ్యాంగ హక్కును కాల రాసే అధికారం మీకు లేదని గ్రహించాలని సీఎం జగన్‌కు సూచించారు.