నేరం రుజువైతే ఎన్నో ఏళ్ళు జైలుకెళ్తారు.. జగన్‌పై వర్ల రామయ్య సెటైర్లు..!

Saturday, January 9th, 2021, 03:00:43 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా సీఎం జగన్ నడిపిస్తున్నారని విజయసాయి అంటున్నారని అన్నారు. సరే చెప్పినట్టుగానే ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా నడిపిస్తున్న సీఎం జగన్, ఆయనని అభినందించిన విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా భారతదేశంలోనే అత్యంత పెద్దదయిన అవినీతికేసులో ఆ1,ఆ2 ముద్దాయిలుగా కోర్టు విచారణలో ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. అయితే ఈ కేసులో నేరం రుజువైతే వారిద్దరు ఎన్నో ఏళ్ళు జైలుకెళ్తారని అన్నారు.