సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం మూర్ఖత్వం – వర్ల రామయ్య

Tuesday, December 8th, 2020, 03:00:11 AM IST

ఏపీ రాజధాని అమరావతిని తరలించే శక్తి జగన్‌కు లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు కురిపించారు. మూడు రాజధానులను ప్రకటించడం జగన్ తెలివి తక్కువ నిర్ణయమని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని రైతులు 356 రోజులుగా ధర్నా చేస్తున్న జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం మూర్ఖత్వం అని అన్నారు.

అయితే జగన్‌ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించారని అన్నారు. దేశ చరిత్రలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి జగన్ అని, 2004కి ముందు జగన్ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఉందని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందని, ఆయన అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతున్నారన్నారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు.