ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖపై మండిపడ్డ వర్ల రామయ్య..!

Thursday, October 1st, 2020, 12:30:00 PM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ రాసిన లేఖపై స్పందించిన వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ రాశారు. డీజీపీ లేఖ అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. డీజీపీ లేఖ చూస్తుంటే ప్రశ్నించే నోళ్లను నొక్కాలన్న ఉద్దేశం కనబడుతుందని, చంద్రబాబు ప్రాథమిక హక్కుని హరించే విధంగా డీజీపీ లేఖ రాశారని మండిపడ్డారు.

అయితే రామచంద్రపై దాడి కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అడిగితే, సాక్ష్యాలు సీల్డ్ కవర్‌లో పంపమని ఎద్దేవా చేస్తారా అని ప్రశ్నించారు. అంతర్వేది రథాన్ని తగలబెట్టింది చంద్రబాబే అని విజయసాయి అన్నప్పుడు ఎందుకు సాక్ష్యాలు కోరలేదని నిలదీశాడు. రామచంద్రపై దాడి చేసిన ప్రతాపరెడ్డి టీడీపీకి చెందినవాడని చెబుతున్నారని, దీనిపై డీజీపీ దగ్గర ఉన్న సాక్ష్యాలేమిటని అడిగారు. హైకోర్ట్ తప్పుపట్టినా డీజీపీ తీరు మార్చుకోకుండా ప్రతిపక్షనేతకు లేఖ రాయడం తగదని అన్నారు.