ప్రజలపై నమ్మకం లేదా.. సీఎం జగన్‌పై వర్ల రామయ్య సీరియస్..!

Thursday, February 18th, 2021, 03:00:38 AM IST

Varla-Ramaiah
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీరియస్ అయ్యారు. నేడు విశాఖకు వెళ్ళిన సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న దీక్షా శిబిరాల వద్దకు ఎందుకు వెళ్ళలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ ఎందుకు గౌరవించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యమం చేస్తున్న వారి దగ్గరకు వెళ్లకుండా, కేవలం నలుగురిని ఎయిర్‌పోర్టుకు పిలిపించుకొని మాట్లాడటం రాష్ట ప్రజలను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే నేడు తొలిసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడిన సీఎం జగన్ తనను పోస్కో ప్రతినిధులు కలిసిన మాట వాస్తమేనని, అయితే వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని అన్నారు. కడప, భావనపాడు, కృష్ణపట్నం పోర్టుల దగ్గర స్టీల్‌ప్లాంట్ పెట్టమని తాను పోస్కో ప్రతినిధులతో పేర్కొన్నానని, ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ప్లాంటు ఏర్పాటు చేసినా పోస్కోకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు సీఎం జగన్ తెలిపారు.