దళితుడనే ఆయనను సస్పెండ్ చేశారు.. వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు..!

Tuesday, December 29th, 2020, 12:54:46 AM IST


వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పథకాలకు బ్యాంకుల రుణాలు మంజూరు చేయలేదన్న కారణంగా బ్యాంకుల ముందు చెత్తవేయడాన్ని వర్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. బ్యాంకుల ముందు చెత్తవేసి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం క్షమించరానిదని అన్నారు. దళితుడన్న ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్‌ను సస్పెండ్ చేసి మిగతావారిని ఎందుకు చేయలేదని అన్నారు.

అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వైసీపీ తీరు ఉందని, ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన దళిత వర్గానికి చెందిన ప్రకాశ్ రావును సస్పెండ్ చేసిందని అన్నారు. ఇప్పుడు ఉయ్యూరు కమీషనర్‌ను సస్పెండ్ చేయడం కూడా దళిత వర్గాలపై దాడితో సమానమే అని వ్యాఖ్యానించారు. అయితే వెంటనే దళిత కమీషనర్ ప్రకాశ్‌రావు సస్పెన్షన్‌ను తొలగించాల్సిందిగా టీడీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు.