చింత చచ్చినా పులుపు చావలేదు.. విజయసాయిపై వర్ల రామయ్య సెటైర్లు..!

Monday, August 10th, 2020, 05:17:51 PM IST

Varla-Ramaiah

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేందంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ కట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు కాదని అన్నారు.

కానీ హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే అని ప్రపంచమంతా తెలుసని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పండి అని ప్రశ్నించారు.