డీజీపీ గారు మీకు మళ్ళీ పిలుపు తప్పదేమో.. వర్ల రామయ్య కామెంట్స్..!

Tuesday, December 22nd, 2020, 05:38:48 PM IST

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌పై వర్ల రామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దిశ పేరుతో మహిళా పోలీసులకు అందించిన స్కూటీలకు వైసీపీ రంగులు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ అంశంపై డీజీపీనీ ఉద్దేశించి మాట్లాడిన వర్ల రామయ్య అయ్యా, డీజీపీ గౌతం సవాంగ్ గారు గుంటూరు పోలీసులు ద్విచక్ర వాహనాలకు అధికార పార్టీ రంగులు వేసి వారి స్వామి భక్తి చాటుకున్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇదే రంగులు వేస్తే, వారికి రంగు పడింది. ఇప్పుడు, ఈ పోలీసు వాహనాలకు ఆ రంగులు తొలగించకపోతే మరోసారి హైకోర్టు పిలుపు మీకు తప్పదేమో అని ట్వీట్ చేశారు.