నా మాట వినండి.. సీఎం జగన్‌కు వర్ల రామయ్య సజేషన్..!

Wednesday, August 12th, 2020, 02:50:36 PM IST

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఓ సజేషన్ ఇచ్చారు. ఇటీవల దళిత యువకుడిని శిరోముండనం వేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వానికి “దళిత వ్యతిరేకి” అనే ముద్ర పడకుండా చూచుకోండని, వెంటనే శిరో ముండన కేసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయండని చెప్పారు. మీ సలహా దారుల మాటలు వినకండి, నా సలహా మాత్రమే విని అతన్ని అరెస్టు చేసి మీ ప్రభుత్వ గౌరవం కాపాడుకోఒడి లేదా దళిత ద్రోహిగా మిగిలి పోతారు. నా మాట వినండి అని అన్నారు.