ఆ కేసులో జోక్యం చేసుకోకండి.. జగన్ సర్కార్‌కు వర్ల రామయ్య సజేషన్..!

Tuesday, September 1st, 2020, 03:24:03 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం కొద్ది రోజుల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించడం లేదని, కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా అందించడంలేదని ప్రభుత్వం మీద విమర్శలు చేసి సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.

ఆ తరువాత తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ విశాఖలో రోడ్డు మీద అర్థనగ్నంగా నిరసనకు దిగడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. చివరకు ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని ముద్రవేశారు. అయితే ఈ కేసులో పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా స్పందించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డాక్తర్ సుధాకర్‌ను పిచ్చి వాడుగా చేసే చిత్రీకరణ జరుగుతోందని అప్పుడు మేము ఎంత మొర పెట్టుకొన్నా వినలేదని, ఇప్పుడు సీబీఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టుకు చెప్పిందని ఇప్పటికైనా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపాడు.