సజ్జల గారు మీకు అర్ధమవుతుందా.. వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు..!

Wednesday, September 23rd, 2020, 02:39:16 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జల గారూ! చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మీలాగ అవినీతి చొక్కా తొడగ లేదని అన్నారు. ఆనాడు వాజ్‌పాయితో కలసినా, బీజేపీతో ఉన్నా, సెక్యులరిజం పాటిస్తేనే అన్న ఒప్పందంతోనే అని గుర్తుచేశారు. మీ సలహాలు కాళ్ళ బేరం దగ్గరే ఆగినవని, దాటి మెడలు వఒచడం ఎప్పుడు అని ప్రశ్నించారు. మీ శల్యసారథ్యం ఇప్పటికే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిఒదని ఇది మీకు అర్ధ మౌతుందా అంటూ ట్వీట్ చేశారు.