సీఎం జగన్ పై వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు

Friday, January 15th, 2021, 08:04:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరుసగా దేవాలయాల్లో విగ్రహల పై దాడులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వరుస దాడులు జరగడం పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పోలీస్ శాఖ అప్రమత్తం అయి, అందుకు తగు విధమైన చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రతి పక్ష పార్టీ నేతలు మాత్రం అధికార పార్టీ తీరు పై సర్వత్రా విమర్శలు చేస్తున్నారు. కీలక తెలుగు దేశం పార్టీ, బీజేపీ మరియు జన సేన లు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ను తప్పు బడుతూ చర్యలు తీసుకోవడం లేదు అని వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నేపథ్యం లో మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత వర్ల రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కి గోపూజ చేసి రాష్ట్రంలో రాష్ట్రం లోని హైందవ భక్తులకు సంతోషాన్ని కలిగించారు అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఆనందం అంటూ చెప్పుకొచ్చారు. అయితే మరీ, పోయిన సంక్రాంతి కి మీరు ఇంటికే పరిమితం అయ్యారు అని, గోపూజ చేయలేదు ఎందుకని అంటూ వరుస ప్రశ్నలు వేశారు. ఈ ఏడాది దేవాలయాల మీద దాడులు, మీ గోపూజ కి కారణమా, లేక ఇకనుండి ప్రతి ఏడాది చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. పీకే దయ, మా ప్రాప్తం అంటూ చెప్పుకొచ్చారు. అయితే వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఈ అంశం పై అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు.