ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం చంద్రబాబును సాధించడమే – వర్ల రామయ్య

Tuesday, February 9th, 2021, 04:31:17 PM IST

Varla-Ramaiah

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు కీలక నేతలు మరొకసారి వరుస విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనా విధానం పై వర్ల రామయ్య మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎటు పోయినా, విశాఖ స్టీల్ ఏ గంగ లో మునిగినా, పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోయినా, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి అగమ్య గోచరంగా మారినా, విద్యార్థులు ఉద్యోగాలు లేక రోజు కూలీలు గా మారుతున్నా, ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం మాత్రం చంద్రబాబు ను సాధించడమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అదే ఆయన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కూడా అంటూ వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అయితే తెలుగు దేశం పార్టీ కి చెందిన మరొక కీలక నేత బోండా ఉమా సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం లో వైసీపీ అనుసరిస్తున్న ధోరణి పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కి సంబందం లేకుంటే, ఆయన తక్షణమే తన పార్టీ కి చెందిన 28 మంది ఎంపీ లతో రాజీనామా లు చేయించి, వారంతా కేంద్రం పై పోరాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ చేస్తున్నవి కంటి తుడుపు చర్యలు అంటూ బోండా ఉమా సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు.