సీఎం జగన్ ఇప్పటికైనా రైతుల పట్ల తన వైఖరి మార్చుకోవాలి – వర్ల రామయ్య

Wednesday, October 28th, 2020, 01:32:52 PM IST

Varla-Ramaiah

రైతులకు బేడీలు వేసిన ఘటన విషయం లో టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత వర్ల రామయ్య సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రైతులకు సంకెళ్లు వేసిన ఫొటోలను జయపరుస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కి వర్ల రామయ్య ఒక లేఖ రాశారు. కరుడుగట్టిన నేరస్తులు, దేశ భద్రత కి భంగం కలిగించే వారికి వేసినట్లుగా అమరావతి రైతులకు సంకెళ్లు వేయడం అత్యంత దారుణం అంటూ మండిపడ్డారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా రైతుల పట్ల తన వైఖరి మార్చుకోవాలి అని సూచించారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం న్యాయవ్యవస్థను దిక్కరించడమే అవుతుంది అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అయితే ఈ లేఖలో వీటితో పాటుగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి ఈ విషయం లో సరైన చర్యలు తీసుకోవాలని కోరారు వర్ల రామయ్య. మరి ఈ వ్యవహారం పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.