వర్మకు వార్నింగ్ ఇచ్చారు.. రియాక్షన్ ఎలా ఉంటుందో మరి..?

Monday, January 25th, 2016, 10:48:54 AM IST

varma
విజయవాడ రాజకీయాలను అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే.. సందేహం లేకుండా చెప్పే పేరు వంగవీటి మోహన రంగ. ఇప్పటికీ ఈ పేరుకు విజయవాడలో ఫాలోయింగ్ ఎక్కువ. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఆరునెలల్లోనే ప్రభంజనం సృష్టిస్తే.. రంగ మాత్రం ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రంగ రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ఎన్నో అంశాలు చాలా సున్నితమైనవి. ఇప్పుడు ఈ అంశాల మీదే సినిమా తీస్తానంటూ ప్రకటించాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

దీనిపై స్పందించిన రంగ కుమారుడు వంగవీటి రాధ వర్మకు గట్టి వార్నింగే ఇచ్చారు. వర్మ తన తండ్రి జీవితం ఆధారంగా సినిమా తీయడంలో తనకెలాంటి అభ్యంతరమూ లేదని.. కానీ వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లే చూపాలని తెలిపారు. అలా కాకుండా అవాస్తవాలను చిత్రీకరిస్తే రంగ కుమారుడినైన తనకన్నా.. ఆయన అభిమానులు తీవ్రంగా స్పందిస్తారని కాబట్టి.. జాగ్రత్త వహించాలని తెలిపారు. పైగా ఇప్పటి వరకూ వర్మ ఈ సినిమా విషయమై తనను కలవలేదని కూడా తెలిపారు. అవతలి వాళ్ళ విమర్శలను కూడా తనకనుకూలంగా ఉపయోగించుకుని.. ప్రచారం పొందే వర్మ రాధ వార్నింగ్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.